Ramya Nambeeshan: 'మీటూ' అన్నందుకు ఒక్క అవకాశం కూడా రావడం లేదు: కేరళ బ్యూటీ రమ్య ఆవేదన!

  • పలు భాషల చిత్రాల్లో నటించిన రమ్య నంబీశన్
  • 'మీటూ'పై ఇటీవల ప్రశ్నించిన రమ్య
  • అవకాశాలు లేకుండా చేశారని ఆరోపణ
క్యాస్టింగ్ కౌచ్, వేధింపులపై న్యాయమైన రీతిలో ప్రశ్నించినందుకు తనకు ఒక్క అవకాశం కూడా లేకుండా చేశారని కేరళ బ్యూటీ, పలు తమిళ, మలయాళ హిట్ చిత్రాల్లో నటించిన రమ్య నంబీశన్ వాపోతోంది. కోలీవుడ్ లో పిజా, సేతుపతి, మెర్క్యూరీ వంటి సినిమాల్లో నటించిన రమ్య, తాజా చిత్రం 'నట్పున్నా ఎన్నాన్ను తెరియుమా' విడుదలకు సిద్ధమైంది.

అయితే, ఇప్పుడు ఆమెకు కొత్తగా ఒక్క అవకాశం కూడా రావడం లేదట. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత కోసం డబ్ల్యూసీసీ పేరిట ఓ సంఘం ఏర్పాటు కాగా, దానిద్వారా ప్రశ్నించిన తనను పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చింది రమ్య. తానిప్పుడు కోలీవుడ్ ను నమ్ముకున్నానని అంటోంది. మహిళలకు రక్షణగా 'మీటూ' ఉప్పెనలా వచ్చిందని, అయితే, గొంతెత్తిన వారిని పరిశ్రమ దూరం పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
Ramya Nambeeshan
Kollywood
Malayalam
Tamil
Kerala
Movie
MeToo India

More Telugu News