rajamouli: రాజమౌళి మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇదేనా?

షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. ఆ మూడు ‘ఆర్’ లకు అర్థం రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అని అనుకున్నారు.

ఆ విషయం పక్కనబెడితే.. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అనేది అసలు టైటిల్ కావచ్చేమోననే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల వేదికగా వెలువడుతున్నాయి. అయితే, ‘తారక్ రామ్’ అనే మరో టైటిల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Go Back to Shorts
rajamouli
junior ntr
Ramcharan
RRR

More Telugu News