producer: నిర్మాత ఆదిత్యారామ్ కు మాతృ వియోగం

  • చెన్నైలో మృతి చెందిన ఆదిత్యారామ్ తల్లి లక్ష్మి
  • ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు
  • ఆమె మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ తల్లి లక్ష్మి కన్నుమూశారు. చెన్నైలో ఈరోజు ఉదయం ఆమె మరణించారు. ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, తెలుగులో సందేడసందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ తదితర చిత్రాలను ఆదిత్యారామ్ నిర్మించారు. చెన్నైలోని ఆదిత్య రామ్ స్టూడియోస్ కు, తమ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆయన అధినేతగా వ్యవహరిస్తున్నారు.
producer
aditya ram
mother
demise

More Telugu News