Chandrababu: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. ఫరూక్ పై సీఎం చంద్రబాబు సరదా వ్యాఖ్యలు !

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఈరోజు జరిగిన విషయం తెలిసిందే. కొత్త మంత్రులుగా ఎన్.ఎమ్.డి. ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్ లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ పై సీఎం చంద్రబాబునాయుడు సరదా వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ ముదురని ..ఆయనకు ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదంటూ చంద్రబాబు అనడంతో అక్కడున్నవారి నవ్వులు చిందించారు.

 కొత్త మంత్రులకు అందరూ సహకరించాలని సూచించారు. మంత్రి ఫరూర్ అల్లా సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. కిడారి శ్రావణ్ కుమార్ ఇంగ్లీషు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. కొత్త మంత్రులు, మంత్రి వర్గ సభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ ను, సీఎం చంద్రబాబునాయుడు గ్రూప్ ఫొటోదిగారు.

కాగా, మంత్రి ఫరూక్ కు మైనార్టీ సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. ఇప్పటికే మంత్రిగా వ్యవహరిస్తున్న నక్కా ఆనంద్ బాబుకు సాంఘిక సంక్షేమ శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగించారు.  
Go Back to Shorts
Chandrababu
minister
farooq

More Telugu News