Andhra Pradesh: చంద్రబాబు మృత్యుంజయుడు.. బాంబులు పెట్టినా హీరోలా బయటకొచ్చారు!: బుద్ధా వెంకన్న

  • ఆయనకు ప్రజాబలం మెండుగా ఉంది
  • జగన్ కు గట్టి భద్రత కల్పిస్తాం
  • కోడి కత్తి డ్రామాలు రిపీట్ చేయొద్దు
చంద్రబాబు మృత్యుంజయుడని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. అందుకే తిరుమలలో మావోయిస్టులు బాంబులు పెట్టి పేల్చినా ప్రాణాలతో బయటకు వచ్చారని వెల్లడించారు. ప్రజాబలం ఉంది కాబట్టే చంద్రబాబును ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు.

ఈరోజు విజయవాడలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలీసులు జగన్ కు గట్టి భద్రత కల్పిస్తారని ఆయన తెలిపారు. కోడి కత్తి డ్రామాను రిపీట్ చేయవద్దని చెప్పి జగన్ ను ప్రజాసంకల్ప యాత్రకు పంపాలని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు బుద్ధా వెంకన్న సూచించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష వైసీపీ నాటకాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
budha venkanna
YS Vijayamma

More Telugu News