YSRCP: వైసీపీకి షాక్‌.. జనసేనలో చేరనున్న కర్రి వెంకటరమణ?

  • ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు
  • ఆయనతో టచ్‌లో ఉన్న జనసేన నాయకులు
  • ఆర్థికంగా, సామాజికంగా రమణ బలమైన నాయకుడు
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్‌ తగలనుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి వెంకటరమణ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో, పార్టీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఇమడలేకపోతున్న వెంకటరమణ జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలకనేత రమణతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడైన వెంకటరమణ ప్రస్తుతం వైసీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ మారితే జిల్లాలో వైసీపీకి భారీ దెబ్బతగిలినట్టే. మరోవైపు వైసీపీ అధిష్ఠానం సుబ్బారావునాయుడుని కో ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పించడంతో ఆయన అనుచరులు కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం.
YSRCP
East Godavari District
karri venkataramana

More Telugu News