Andhra Pradesh: వైఎస్ విజయమ్మ ఆరోపణలకు జవాబిచ్చిన హోంమంత్రి చినరాజప్ప!
- విచారణ వేగంగా సాగుతోంది
- విజయమ్మ విమర్శలు సరికాదు
- జగన్ పోలీసులకు సహకరించట్లేదు
జగన్ పై హత్యాయత్నం కేసులో ఇంకా సిట్ విచారణ జరుపుతోందని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కేసు విచారణ సరిగ్గా సాగడం లేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పడం సరికాదన్నారు. జగన్ విచారణకు, వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చినరాజప్ప గుర్తుచేశారు.
సిట్ పూర్తిస్థాయిలో నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నారని చినరాజప్ప తెలిపారు. కేంద్రం సహకరించకున్నా శాంతిభద్రతల పరిరక్షణలో, అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందని ఆయన వెల్లడించారు.