Kurnool District: ఓ యువతి పెట్టిన పంచాయితీ... టీడీపీ నేత ప్రాణం తీసింది!

  • కర్నూలు జిల్లాలో టీడీపీ నేత సోమేష్ హత్య
  • పొలం విషయంలో ఇటీవల పంచాయితీ
  • ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించిన సోమేష్
  • పథకం ప్రకారం హత్య చేయించిన మరో వర్గం
కర్నూలు జిల్లాలో కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ నేత సోమేష్ గౌడ్ హత్య వెనుక కారణాన్ని పోలీసులు ఛేదించారు. ఘటన వెనుక ఫ్యాక్షన్ నేపథ్యం లేదని, ఓ యువతి పెట్టిన పంచాయితీ కారణంగానే హత్య జరిగిందని వెల్లడించారు. తన సామాజిక వర్గంలోనే రెండు కుటుంబాల మధ్య ఓ యువతి పొలం విషయంలో పంచాయితీ జరిగిందని, ఆయన ఒక వర్గం వారికి అనుకూలంగా వ్యవహరించడంతోనే రెండో వర్గం ద్వేషం పెంచుకుని ఈ పని చేయించిందని, ఆయన అనుచరుల ప్రమేయం కూడా దీని వెనుక ఉందని పోలీసు వర్గాలు వెల్లడించారు.

వెంకటాపురంలోని ఓ కుటుంబానికీ, సోమేష్ గౌడ్ వర్గం వారికి కొన్నేళ్లుగా పొలం విషయంలో వివాదం ఉందని, సోమేష్ అధికార పార్టీలో ఉండటంతో అదను చూసి హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలపైనా విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఎనిమిది మందిపై కేసు పెట్టామని, భారీ బందోబస్తు మధ్య సోమేష్ అంత్యక్రియలను జరిపించామని అన్నారు. ఘటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ తలెత్తకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Kurnool District
Telugudesam
Somesh
Murder

More Telugu News