amaravathi: అమరావతికి రాహుల్ గాంధీ సహా 10 మంది కీలక నేతలు.. చంద్రబాబు నివాసంలో విందు!

  • డిసెంబర్ 23న అమరావతికి వచ్చేస్తున్న నేతలు
  • జాబితాల మమతా, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితరులు
  • ధర్మపోరాట దీక్షలో పాల్గొననున్న నేతలు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చే నెల 23న అమరావతికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరగనున్న విందు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రాహుల్ తో పాటు కుమారస్వామి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్ సహా 10 మంది నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అనంతరం అదేరోజు అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలో వీరంతా పాల్గొననున్నారు. రాహుల్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలంతా అమరావతికి వస్తున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
amaravathi
Chandrababu
Rahul Gandhi

More Telugu News