Chandrababu: రేపే కేబినెట్ విస్తరణ.. ఫరూక్, కిడారి శ్రవణ్ లకు కేటాయించిన శాఖలు ఇవే!

  • ఫరూక్, శ్రవణ్ లకు శాఖలను ఖరారు చేసిన చంద్రబాబు
  • ఫరూక్ కు వైద్య ఆరోగ్య శాఖ
  • శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖ
ఏపీ కేబినెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విస్తరించనున్నారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఫరూక్ తో పాటు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ లకు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వారికి శాఖలను కూడా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఫరూక్ కు వైద్య ఆరోగ్య శాఖ, కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. రేపు వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కిడారి శ్రవణ్ కు చంద్రబాబు సూచించారు.
Chandrababu
farooq
kidari sravan
cabinet
portfolio

More Telugu News