దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: అశోక్ గెహ్లాట్
- సామాన్యులు, వ్యాపారులు, రైతులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు
- ఆర్బీఐ, సీబీఐ, ఈడీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి
- హిందూ అతివాదంతో బీజేపీ నేతలు భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నారు
మోదీ చెప్పినట్టు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 'సేవ్ నేషన్ - సేవ్ డెమోక్రసీ' నినాదంతో అందరం కలసి ముందుకు సాగుతామని అన్నారు. హిందూ అతివాదంతో బీజేపీ నేతలు భారత లౌకికత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.