రాహుల్ గాంధీ దూతగా చంద్రబాబును కలిశా: అశోక్ గెహ్లాట్
- రాహుల్, చంద్రబాబుల కలయికతో మహాకూటమికి తొలి అడుగు పడింది
- భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించడానికే వచ్చా
- దేశ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపాయి
దేశ భవిష్యత్తు కోసమే టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని గెహ్లాట్ తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే మతతత్వ శక్తులను తరిమేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2019లో బీజేపీని ఓడించేందుకే... బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడుతున్నాయని అన్నారు.