గాంధీభవన్ వద్ద అసంతృప్తుల ఆందోళన.. ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
- లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆత్మహత్యాయత్నం
- మల్కాజ్గిరి టికెట్ శ్రీధర్‌కు ఇవ్వాలని ఆందోళన
- రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన
ఉప్పల్ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వాలంటూ ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అలాగే మల్కాజ్గిరి టికెట్ నందికంటి శ్రీధర్‌కు ఇవ్వాలని, నకిరేకల్ టికెట్‌ను ప్రసన్న రాజుకు ఇవ్వాలంటూ వారి అనుచరులు ఆందోళన నిర్వహిస్తే.. ఖానాపూర్ టికెట్‌ను రమేష్ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు.