Telugudesam: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత దుర్మరణం!

  • బైక్‌ను ఢీకొట్టిన కారు
  • ఘటనా స్థలంలోనే మృతి చెందిన నేత
  • తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి
పశ్చిమగోదావరి జిల్లా భోగోలు మాజీ సర్పంచ్, టీడీపీ నేత తాడేపల్లి కాంతారావు (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం భోగోలు నుంచి లింగపాలేనికి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మఠంగూడెం వద్ద ఎదురుగా వస్తున్న ఇండికా కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో కాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాంతారావు మృతి విషయం తెలిసి టీడీపీ నేతలు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. కాంతారావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telugudesam
West Godavari District
Bhogolu
Road Accident

More Telugu News