Hyderabad: హైదరాబాద్‌లోని యాకత్‌పురాలో రూ.68 లక్షలు పట్టివేత

  • సంతోష్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు
  • వాహనంలో తరలిస్తున్న సొమ్ము పట్టివేత
  • ఏటీఎంలో డబ్బులు పెట్టే ఏజెన్సీదిగా అనుమానం
హైదరాబాద్‌లోని యాకత్‌పురా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 68 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఎటువంటి పత్రాలు వారి వద్ద లేకపోవడంతో డబ్బులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో అన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సొమ్ము ఏటీఎంలో డబ్బులు పెట్టే ఓ ఏజెన్సీకి చెందినదిగా సమాచారం. అయితే, అందుకు సంబంధించిన సరైన వివరాలు ఇవ్వడంలో విఫలం కావడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్త వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Hyderabad
Santosh Nagar
Telangana
ATM Agency
yakutpura

More Telugu News