Kurnool District: టీడీపీ మండలాధ్యక్షుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

  • శుక్రవారం అర్ధ రాత్రి ఘటన
  • వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి వేళ టీడీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. దేవనకొండ మండలం కె.వెంకటాపురం శివారులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  మండల టీడీపీ అధ్యక్షుడైన సోమేశ్వర గౌడ్‌కు దేవనకొండలో ఓ మద్యం షాపు ఉంది. రాత్రి షాపు మూసేసిన అనంతరం కుమారుడితో కలిసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో కాపు కాసిన ప్రత్యర్థులు సోమేశ్వర్ కంట్లో కారం చల్లి హత్య చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వేటకొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు శివ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Kurnool District
Telugudesam
Devanakonda
Murder
Someshwar Goud

More Telugu News