congress: కాంగ్రెస్ కు మాజీ మంత్రి బాలరాజు రాజీనామా... రేపు జనసేనలో చేరిక!

  • ఏపీ కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్
  • రాజీనామా లేఖను రాహుల్ కు పంపిన బాలరాజు
  • జనసేనలో చేరనున్న మాజీ మంత్రి
ఏపీ కాంగ్రెస్ లో మరో వికెట్ పడిపోయింది. ఆ పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఆయన పంపించారు. రేపు జనసేన పార్టీలో ఆయన చేరనున్నారు. ఇప్పటికే మరో కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, జనసేనలో నేతల చేరికలు ఊపందుకుంటున్నాయి. 
congress
pasupuleti balaraju
resing
janasena

More Telugu News