jagapathibabu: చరణ్ మంచి మనసున్న నిర్మాత: జగపతిబాబు

  • చరణ్ తో కలిసి నటించిన జగపతిబాబు
  • ఇద్దరి మధ్యా ఏర్పడిన సాన్నిహిత్యం 
  • చరణ్ ను అభినందించిన జగపతిబాబు 
చరణ్ .. జగపతిబాబు 'రంగస్థలం' సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వాళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక నిర్మాతగా చరణ్ నిర్మిస్తోన్న 'సైరా' సినిమాలోను జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాతగా చరణ్ గురించి మాట్లాడారు.

"ఇటీవలే 'సైరా'కి సంబంధించిన కొన్ని భారీ సన్నివేశాలను 'జార్జియా'లో చిత్రీకరించారు. వందలాది మంది ఆర్టిస్టులు అక్కడి షూటింగులో పాల్గొన్నారు. చిన్నా పెద్దా .. జూనియర్ .. సీనియర్ అనే భేదం లేకుండా ఒక నిర్మాతగా చరణ్ అందరినీ ఎంతోమంచిగా చూసుకున్నారు. అందరి ఆహారం .. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యాలను కల్పించారు. షూటింగు జరిగే రోజుల్లో ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందులను ఆయన చక్కగా పరిష్కరించేవారు. నాకు తెలిసి చరణ్ మంచి నటుడే కాదు .. అంతకు మించి మంచి మనసున్న నిర్మాత కూడా" అని చెప్పుకొచ్చారు.    
jagapathibabu
charan

More Telugu News