Andhra Pradesh: విజయవాడలో రేపు జనసేనాని పర్యటన.. ఏర్పాట్లు పూర్తిచేస్తున్న కార్యకర్తలు!

  • రెండ్రోజులు పర్యటించనున్న నేత
  • పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
  • తూర్పుగోదావరిలో పోరాటయాత్ర
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రలో పాల్గొంటున్న ఆయన.. రేపు విజయవాడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు.

అనంతరం తిరిగి ఈ నెల 12న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి పోరాట యాత్రలో పాల్గొంటారు. పోరాటయాత్రలో భాగంగా అక్రమ మైనింగ్ సహా పలు సమస్యలను పవన్ ప్రస్తావిస్తున్నారు. కాగా, విజయవాడకు రానున్న పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు జన సైనికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Andhra Pradesh
Vijayawada
East Godavari District
Pawan Kalyan
porata yatra
2 day tour
janasena
cadre
workers

More Telugu News