అక్షయ్ మరణంతోనే '2.ఓ' కథ మొదలవుతుందట!

  • స్మార్ట్ ఫోన్ కారణంగా మరణించే అక్షయ్
  • దుష్టశక్తిగా మారి వెంటాడే పాత్ర 
  • అందరినీ ఆలోచింపజేసే కాన్సెప్ట్      
ఒక వైపున రజనీ అభిమానులు .. మరో వైపున అక్షయ్ ఫ్యాన్స్ '2.ఓ' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల వదిలిన టీజర్లో అక్షయ్ కుమార్ ను పక్షి రాక్షసుడిగా చూపించారు. స్మార్ట్ ఫోన్లపై ఆయన ద్వేషం చూపడం .. స్మార్ట్ ఫోన్లు వాడేవారి నుంచి బలవంతంగా వాటిని లాక్కోవడం చూపించారు. స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లంతా హంతకులే అని ఆయన అనడం గురించి అంతా చర్చించుకున్నారు.

అందుకు గల కారణమేమిటనేది ఇప్పుడు కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ అదే పనిగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం వలన రేడియేషన్ కారణంగా చనిపోతాడట. ఇక్కడి నుంచే కథ మొదలవుతుందని చెబుతున్నారు. ఆ తరువాత ఒక దుష్ట శక్తిగా మారిన అక్షయ్, స్మార్ట్ ఫోన్లు వాడే వారిని టార్గెట్ చేస్తూ వెళతాడని అంటున్నారు. శంకర్ చాలా మంచి పాయింట్ ఎంచుకున్నాడనీ, ఇది అందరినీ ఆలోచింపజేస్తుందని చెప్పుకుంటున్నారు.    
Go Back to Shorts
rajani
akshay

More Telugu News