jagan case: జగన్‌ పిటిషన్‌ విచారణ.. సిట్‌ నివేదికను సీల్డ్‌ కవర్లో కోరిన హైకోర్టు

  • తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
  • ఈలోగా జగన్‌ కూడా తన వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశం
  • జగన్‌ హత్యకు కుట్ర జరిగిందని వాదించిన ఆయన తరపు న్యాయవాది
తనపై జరిగిన హత్యాయత్నం సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ అధినేత, విపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈరోజు విచారించింది. గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ ఆయన తరపు న్యాయవాది నాటి సంఘటన వివరాలను కోర్టు ముందుంచారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో పెట్టి తమకు అందించాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అలాగే మంగళవారం లోగా తన వాంగ్మూలాన్ని కూడా జగన్‌ ఏపీ పోలీసులకు తెలియజేయాలని కోర్టు సూచించింది.
jagan case
sit information asked the court
nest hearing tuesday

More Telugu News