S*x rocket: వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతోపాటు మొత్తం నలుగురి అరెస్టు

  • బ్యూటీపార్లర్‌ ముసుగులో తెరవెనుక బాగోతం
  • పోలీసుల దాడిలో బట్టబయలైన వ్యవహారం
  • విజయవాడ మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో ఘటన
వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతోపాటు మరో ముగ్గురు నిందితులను విజయవాడ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. విజయవాడ నగరం మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలో నెలరోజుల క్రితం నుంచి నోవెల్‌ బ్యూటీపార్లర్‌ నడుస్తోంది. ఈ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో పోలీసులు అలర్టయ్యారు. అదను చూసుకుని పార్లర్‌పై దాడి చేశారు.

నిర్వాహకురాలు కాకర్ల నందినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు గుట్టు రట్టయింది. నెలరోజుల క్రితం ఇక్కడ బ్యూటీపార్లర్‌ ప్రారంభించిన ఆమె వాట్సాప్‌ ద్వారా విటులను ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెతోపాటు పార్లర్‌లో ఉన్న మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు.
S*x rocket
Vijayawada
mogalrajapuram

More Telugu News