Tamil Nadu: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన ఫ్యాక్టరీ

  • కార్ల విడిభాగాల తయారీలో కంపెనీలో అగ్రిప్రమాదం
  • భారీగా ఆస్తినష్టం
  • ఫ్యాక్టరీలో చిక్కుకున్న పలువురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
తమిళనాడులో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలోని ఓ కార్ల విడిభాగాల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ యూనిట్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే కంపెనీ మొత్తం వ్యాపించాయి. నైట్ షిప్ట్‌లో ఉన్న భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీలో చిక్కుకున్న పలువురు ఉద్యోగులను వారు రక్షించారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసుందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Tamil Nadu
Chennai
Fire Accident
Police

More Telugu News