hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ ల పేర్లు మారుస్తాం: బీజేపీ నేత రాజా సింగ్

  • హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరం
  • 1590లో హైదరాబాదుగా కులీ కుతుబ్ షా మార్చారు
  • మొఘలులు, నిజాంల పేరిట ఉన్న పేర్లన్నీ తొలగిస్తాం
గోషామహల్ బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని అన్నారు. ఇదే విధంగా సికింద్రాబాద్, కరీంనగర్ ల పేర్లను కూడా మారుస్తామని చెప్పారు.

హైదరాబాద్ అసలు పేరు భాగ్యనగరమని... 1590లో భాగ్యనగరం పేరును హైదరాబాదుగా కులీ కుతుబ్ షా మార్చారని తెలిపారు. తాము మళ్లీ అసలైన పేరును పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్ర అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని, తదుపరి లక్ష్యం హైదరాబాద్ పేరు మార్చడమేనని అన్నారు. మొఘలులు, నిజాంల పేరిట ఉన్న పేర్లను తొలగిస్తామని... దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామని రాజా సింగ్ తెలిపారు.
hyderabad
secunderabad
name
change
bjp
raja singh
bhagyanagar

More Telugu News