mahakutami: టీజేఎస్, సీపీఐలకు కాంగ్రెస్ కేటాయించిన స్థానాలు ఇవే!

  • కనీసం నాలుగు సీట్లైనా ఇవ్వాలని పట్టుబడుతున్న సీపీఐ
  • ఆరు స్థానాల్లో పోటీ చేసే టీజేఎస్ అభ్యర్థుల ఖరారు  
  • పోటీకి కోదండరామ్ దూరంగా ఉండే అవకాశం
తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంకం పూర్తయింది. మొత్తం 119 స్థానాలకు గాను 94 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా... మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాల చొప్పున కేటాయించారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించే అవకాశం ఉంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను కేటాయించారు. అయితే తమకు కనీసం నాలుగు సీట్లైనా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది.

టీజేఎస్ కు కేటాయించిన స్థానాలు, పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే...
మెదక్ - జనార్దన్ రెడ్డి
సిద్ధిపేట - భవానీరెడ్డి
దుబ్బాక - రాజ్ కుమార్
వరంగల్ ఈస్ట్ - ఇన్నయ్య
మల్కాజ్ గిరి - దిలీప్
మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి.
చెన్నూరు, మిర్యాలగూడల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ అధినేత కోదండరామ్ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
mahakutami
tjs
congress
Telugudesam
cpi
seats
candidates

More Telugu News