Chandrababu: హరీశ్ సృష్టిస్తున్న అపోహలన్నీ కేసీఆర్‌ను సంతోషపెట్టడానికే: రేవంత్

  • నీళ్లు వదిలితే ఏపీకే పోతాయి
  • చంద్రబాబు లేఖలపై అభ్యంతరం లేదు
  • తెలంగాణకు నష్టం జరిగిపోతోందని అపోహలు
ఏపీ సీఎం చంద్రబాబు లేఖలతో తెలంగాణకు ఏదో నష్టం జరుగుతోందంటూ మంత్రి హరీశ్ రావు అపోహలు సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నమంతా కేసీఆర్‌ను సంతోష పెట్టడానికేనని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల విషయంలో భౌగోళికంగా తెలంగాణ ఎగువన ఉందని, కాబట్టి నీళ్లు వదిలితే అవి ఏపీకి పోతాయని తెలిపారు.

కృష్ణా జలాలను కర్ణాటక, గోదావరి జలాలను మహారాష్ట్ర ప్రభుత్వమే ఆపగలదన్నారు. ఇటీవల కేటీఆర్.. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎంగా చంద్రబాబు నీటి వినియోగం విషయమై కేంద్రానికి లేఖలు రాస్తే రాసుండొచ్చని, ఆ లేఖలతో తమకేమీ ఇబ్బంది లేదని తెలిపారన్నారు. అయినా కూడా చంద్రబాబు రాసిన లేఖల కారణంగా తెలంగాణకు ఏదో నష్టం జరిగిపోతోందని హరీశ్ అపోహలు సృష్టించడం కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకేనని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu
Telangana
Harish Rao
KTR
Revanth Reddy

More Telugu News