Chandrababu: చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన దేవేగౌడ, కుమారస్వామి!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. చంద్రబాబును దేవేగౌడ సాదరంగా ఆహ్వానించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ సందర్భంగా అక్కడే ఉన్నారు.

ఈ సందర్భంగా దేవేగౌడకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను చంద్రబాబు అందించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై దేవేగౌడ, కుమారస్వామిలను చంద్రబాబు అభినందించారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుపై ప్రస్తుతం వీరు చర్చిస్తున్నారు. చంద్రబాబుతో బెంగళూరు వెళ్లిన బృందంలో ఏపీ మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
bengaluru
kumaraswamy
deve gowda

More Telugu News