Telangana: అదే జరిగితే తెలంగాణ పాలన చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుంది: మురళీధర్ రావు

  • టీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండూ అవినీతి పార్టీలే
  • కాంగ్రెస్ గెలిస్తే అధికారం చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుంది
  • ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయం
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ గాలి వీస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలూ అవినీతి పార్టీలే అని చెప్పారు.

సీట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సగం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే... అధికారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని అన్నారు. నీతివంతమైన పాలన కోసం రాష్ట్ర ప్రజలంతా బీజేపీకే ఓటు వేయాలని కోరారు. సిద్ధిపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.
Telangana
bjp
congress
Telugudesam
TRS
Chandrababu
muralidhar rao

More Telugu News