Telangana: కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం కుర్చీకి అర్హులే.. కల్వకుంట్ల డీఎన్ఏలో అబద్ధాలు ఉన్నాయి!: జీవన్ రెడ్డి

  • సీఎం కావాలనుకోవడం తప్పా?
  • నేనంటే కేసీఆర్, కవితకు భయం
  • సీఎం కుర్చీకి కేసీఆర్ కంటే కడియమే బెటర్
కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా సీఎం పదవికి అర్హులేనని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని చెప్పారు. టీఆర్ఎస్ లో కేవలం కేసీఆర్, కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారన్నారు. జీవన్ రెడ్డి పోటీలో ఉంటే కేసీఆర్, కవితకు భయమెందుకు వేస్తుందని ప్రశ్నించారు. జగిత్యాలలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.

అసలు అబద్ధాలు అనేవి కల్వకుంట్ల డీఎన్ఏలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ కంటే సీఎం పదవికి కడియం శ్రీహరే ఉత్తమమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు సీఎం పదవిపై ఆశ ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు.
Telangana
election
KCR
KTR
K Kavitha
dna
false
lies
Congress
TRS
Jeevan Reddy
Chief Minister

More Telugu News