jagapathibabu: తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు అమ్మేశాను: జగపతిబాబు

  • అప్పులు చేయవలసి వచ్చింది 
  • వడ్డీలు పెరిగిపోయాయి 
  • ఇంట్లో తెలియనిచ్చేవాడిని కాదు  
ప్రముఖ నిర్మాత తనయుడిగా .. హీరోగా జగపతిబాబు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఆ తరువాత ఆయన మంచితనమే ఆయనకి ఆర్థికపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంట్లో తెలియకుండా మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చాను. 60 శాతం వడ్డీకి తీసుకొచ్చిన రోజులు కూడా వున్నాయి. అప్పులు .. వడ్డీలు పెరిగిపోయాయి. అయినా ఇంట్లో తెలియనీయకుండా ఆ గొడవంతా నేనే పడ్డాను. అప్పుల కారణంగానే ఇల్లు అమ్మేయవలసి వచ్చింది. ఆ సమయంలో నేను వైజాగ్ లో 'లెజెండ్' షూటింగులో వున్నాను. ఆ ఇల్లు పోవడం వలన నేను పెద్దగా బాధపడలేదు. ఇంట్లో వాళ్లు సాధ్యమైనంతవరకూ అమ్మకుండా చూడమని అన్నారు .. కుదరలేదు అమ్మేశాను. ఇలాంటి వాటిపై వ్యామోహాలు పెంచుకోకూడదని అర్థమైంది" అని చెప్పుకొచ్చారు. 
jagapathibabu

More Telugu News