Andhra Pradesh: విజయవాడలో దోపిడీకి యత్నించిన దొంగలు.. చావగొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు!

  • దుర్గాపురం రైల్వేక్వార్టర్స్ వద్ద ఘటన
  • గొంతు కోస్తామని బెదిరించిన దొంగలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
కృష్ణా జిల్లా విజయవాడలో దోపిడీ దొంగల కలకలం చెలరేగింది. ఇక్కడి దుర్గాపురం రైల్వేక్వార్టర్స్ లోని ఓ ఇంట్లోకి దొంగలు ఈ రోజు మధ్యాహ్నం చొరబడ్డారు. ఇంట్లోని నగలు, నగదును ఇవ్వాలనీ, లేదంటే గొంతు కోస్తామని బెదిరించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆ ఇంటిని చుట్టుముట్టి దొంగలను పట్టుకున్నారు.

అనంతరం వాళ్లను బయటకు లాక్కునివచ్చి స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదు చేశారు. విజయవాడలో పట్టపగలు దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
Andhra Pradesh
Vijayawada
thieves
thefting
Police
cash
gold

More Telugu News