Chiranjeevi: మరోసారి తాత కాబోతున్న చిరంజీవి!

  • రెండోసారి గర్భవతి అయిన శ్రీజ
  • విషయాన్ని వెల్లడించిన ఆమె భర్త కల్యాణ్
  • 2016లో శ్రీజను పెళ్లాడిన కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు. ఆయన కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతున్నారు. చిరు చిన్న కుమార్తె శ్రీజ రెండోసారి తల్లి కాబోతున్నారు. శ్రీజ గర్భవతి అనే విషయాన్ని ఆమె భర్త కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

'శ్రీజ కల్యాణ్ బేబీ2 #లోడింగ్' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తన భార్యతో కలసి ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీజ గర్భవతిగా ఉన్నట్టు స్పష్టంగా కనపడుతోంది. 2016లో శ్రీజను కల్యాణ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన తొలి భర్త ద్వారా శ్రీజకు ఇప్పటికే ఒక కూతురు ఉంది. ఆ చిన్నారి శ్రీజ వద్దే పెరుగుతోంది.
Chiranjeevi
daughter
sreeja
kalyan
pregnant

More Telugu News