Mahesh Babu: సూపర్ స్టారంటే మహేష్ బాబే: 'ఆర్ఎక్స్ 100' హీరో పొగడ్తల వర్షం!

  • 'సర్కార్' సినిమా బాగుందన్న మహేష్
  • 'స్పైడర్' ఫలితం రాబట్టకున్న మురుగదాస్ పై మహేష్ గౌరవం
  • సాటి హీరో సినిమాను పొగడటం మహేష్ స్పెషాలిటీ
  • 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ ప్రశంసలు
నిజమైన సూపర్ స్టారంటే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబేనని పొగడ్తల వర్షం కురిపించాడు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ. ఇటీవల విజయ్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్' సినిమాపై మహేష్ తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో మురుగదాస్ మార్క్ ఉందని, సినిమా హిట్టయినందుకు యూనిట్ కు అభినందనలని మహేష్ అన్నారు.

దీనిపై స్పందించిన కార్తికేయ, "కేవలం స్టార్‌ డమ్ ఉంటేనే సూపర్‌ స్టార్ కాదు. మహేష్ బాబు లాంటి వ్యక్తిత్వమే సూపర్ స్టార్‌ కి అసలైన నిర్వచనం. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన చేసిన 'స్పైడర్' ఆశించిన ఫలితం రాబట్టకున్నా, దర్శకుడి పట్ల అతనికున్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదు. సాటి హీరో సినిమాను పొగుడుతూ ఇలా ప్రచారం కల్పించటం మహేష్ లోని ప్రత్యేకత" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు. కాగా, ఇటీవల 'ఆర్‌ఎక్స్ 100'తో హిట్ కొట్టిన కార్తికేయ, ఇప్పుడు 'హిప్పీ'తో వస్తున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu
Murugadas
Vijay
Kartikeya
Spider
Sarkar
Tollywood
Twitter

More Telugu News