Uttam Kumar Reddy: అభ్యర్థుల ఎంపికపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి : స్పష్టత నిచ్చిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

  • ఊహాజనిత జాబితాను నమ్మవద్దని విజ్ఞప్తి
  • శుక్రవారం జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడి
  • సహనం పాటించాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బరిలో నిలపనున్న అభ్యర్థుల విషయమై ఇంకా అధిష్ఠానం సంప్రదింపులు, చర్చలు జరుపుతోందని, అధికారిక జాబితా విడుదలయ్యే వరకు నాయకులు, కార్యకర్తలు సహనం పాటించాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వస్తున్న పేర్లు ఊహాజనితమని, వాటిని నమ్మొద్దని కోరారు. జాబితాపై తుది నిర్ణయం తీసుకుని శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అధికారిక జాబితా విడుదలయ్యే వరకు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
Uttam Kumar Reddy
congress tickets

More Telugu News