Meerut: కారులో చిన్నారిని లాక్ చేసి వెళ్లిన తల్లిదండ్రులు.. అద్దాలు బద్దలుగొట్టి రక్షించిన స్థానికులు

  • చిన్నారిని కారులో వదిలి షాపింగ్‌కు వెళ్లిన జంట
  • ఊపిరి ఆడక విలవిల్లాడిన పాప
  • రక్షించిన స్థానికులు
లాక్ చేసిన కారులో ఊపిరి అందక విలవిల్లాడిపోతున్న చిన్నారిని స్థానికులు అద్దాలు పగలగొట్టి రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. ఈ నెల 5న రాత్రి సెంట్రల్ మార్కెట్‌లో కారులో ఊపిరి ఆడక అవస్థలు పడుతున్న బాలికను గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అద్దాలు బద్దలుగొట్టి చిన్నారిని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కుమార్తెను కారులో వదిలి షాపింగ్‌కు వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు, స్థానికులు మందలించారు.

కారులోని చిన్నారిని గుర్తించిన  స్థానికులు ఆమె తల్లిదండ్రుల కోసం వెతికారని, వారు కనిపించకపోవడంతో మరో దారిలేక అద్దాలు పగలగొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పాప తల్లిదండ్రులను గుర్తించినట్టు ఎస్పీ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.
Meerut
Uttar Pradesh
toddler
car
Locked

More Telugu News