Andhra Pradesh: రేపే బెంగళూరుకు చంద్రబాబు.. కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చలు!

  • బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏక తాటిపైకి తెచ్చే వ్యూహం
  • ఇటీవల ఢిల్లీలో ముఖ్య నేతలను కలిసిన సీఎం
  • దేవెగౌడ, కుమారస్వామితో కీలక చర్చలు
కేంద్రంపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో మరింత బిజీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వరుసగా జాతీయ నేతలను, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన చంద్రబాబు గురువారం బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలతో దేవెగౌడ నివాసంలో భేటీ కానున్నారు.

నిజానికి ఈ నెల 20 తర్వాత చంద్రబాబు చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను కలుస్తారని, అనంతరం బెంగళూరులో కుమారస్వామితో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే, అంతలోనే చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్‌తో భేటీ వచ్చే వారం ఉండొచ్చని సమాచారం.
Andhra Pradesh
Chandrababu
Karnataka
Kumaraswamy
devegowda

More Telugu News