Srikakulam District: మనసు మార్చుకున్న చంద్రబాబు... ఇంట్లోనే దీపావళి!

  • నేడు శ్రీకాకుళంలో పర్యటించాల్సిన చంద్రబాబు
  • దీపావళి అక్కడే జరుపుకోవాలని తొలుత నిర్ణయం
  • ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం మార్చుకున్న ఏపీ సీఎం
నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, తిత్లీ తుపాను బాధితుల మధ్య దీపావళి నిర్వహించుకోవాలన్న తన నిర్ణయాన్ని చంద్రబాబు మార్చుకున్నారు. దీంతో ఆయన పర్యటన రద్దయింది. తిత్లీ బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారి మధ్యనే దీపావళి జరుపుకుంటానని తొలుత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఉద్యోగులు నిర్విరామంగా కష్టపడ్డారు.

ఇప్పుడు మళ్లీ తాను అక్కడికే వెళితే, సెలవు రోజున కూడా ఉద్యోగులు అక్కడ ఉండాల్సి వస్తుందని, వారు ఇబ్బందులు పడతారన్న ఆలోచనతోనే చంద్రబాబు, తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పండుగకు ముందురోజు అధికారులు త్వరగా ఇంటికి చేరాలన్న ఆలోచనతో మంగళవారం నాడు మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఆయన ఉదయం పూటనే ప్రారంభించారు. దీపావళి పర్వదినాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకుంటారని సీఎం కార్యాలయం వెల్లడించింది. 
Srikakulam District
Chandrababu
Titley
Deewali

More Telugu News