Pawan Kalyan: జగన్ పై హత్యాయత్నం జనసేన చేసిందంటారా.. సిగ్గుచేటు!: టీడీపీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్

  • హత్యాయత్నం చేయించింది మేమేనంటారా?
  • శ్రీపాద వల్లభుడికే తెలియాలి
  • పిఠాపురంలో నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై హత్యాయత్నాన్ని జనసేన నేతలు చేయించారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, తెలుగుదేశం పార్టీ నేతల అవినీతిని ఎండగట్టారు.

 అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను టీడీపీ నేతలు హింసిస్తున్నారని పవన్ ఆరోపించారు. జగన్ పై కత్తి దాడి వెనుక ఎవరున్నారన్నది పిఠాపురం శ్రీపాద వల్లభుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే, స్థానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ పేకాటను ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు. సర్పంచ్ గా కూడా గెలవని లోకేశ్ కు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉద్యోగం వచ్చిందని కూడా పవన్ ఎద్దేవా చేశారు.
Pawan Kalyan
Jana Sena
Pithapuram

More Telugu News