pranay: ప్రణయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి అరెస్ట్!

  • మూడు రోజుల క్రితం ప్రణయ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
  • పోలీసు గదిలోంచి పర్సు కొట్టేసిన వైనం
  • తమను చంపేందుకేనన్న ప్రణయ్ తండ్రి
మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తమ ఇంట్లోకి ప్రవేశించాడని, ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు కట్టుకుని ఉన్నాడని ప్రణయ్ భార్య అమృత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అమృతను తమ నుంచి దూరం చేసేందుకు తనను చంపాలని పథకం పన్నారని ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

 ప్రణయ్ కుటుంబ సభ్యులు అందించిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు  సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడేనికి చెందిన ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడు పాత నేరస్తుడని పేర్కొన్నారు. ప్రణయ్ కుటుంబానికి రక్షణగా ఉన్న పోలీసు సిబ్బంది గది నుంచి  అతడు పర్సును దొంగిలించినట్టు డీఎస్పీ పి.శ్రీనివాసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.
pranay
Amrutha varshini
Nalgonda District
Miryalaguda

More Telugu News