congress: టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం?.. ఇందులో కూడా మెలిక పెట్టిన కాంగ్రెస్!

షార్ట్స్‌లో చూడండి
మహాకూటమిలో భాగంగా టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా టీజేఎస్ కు షాక్ ఇచ్చేలా ఒక మెలిక పెట్టింది. పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపింది. అంటే... టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దించుతుందన్నమాట. ఈ అంశంపై టీజేఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరోవైపు తమకు కేటాయించిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించకపోవడంపై కూడా ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
congress
tjs
mahakutami
seats

More Telugu News