KTR: హరీష్ కు, నాకు కుటుంబమే ముఖ్యం.. సెటిలర్లు మావైపే ఉన్నారు: కేటీఆర్

  • నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు
  • హరీష్ పై విపక్షాల విమర్శలు బాధాకరం
  • బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది
తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని... మరో 15 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని మంత్రి కేటీఆర్ చెప్పారు. హరీష్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తనకైనా, హరీష్ కైనా కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాతే రాజకీయాలని చెప్పారు.

ఒకేసారి 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం కేసీఆర్ సాహసానికి నిదర్శనమని తెలిపారు. 100 సీట్లను టీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెప్పారు. హైదరాబాదులోని సెటిలర్స్ అందరూ తమవైపే ఉన్నారని... అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభద్రతాభావానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఐదు సిట్టింగ్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని చెప్పారు. హరీష్ రావుపై విపక్షాలు దారుణమైన విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు.
KTR
kcr
harish rao
TRS
Chandrababu

More Telugu News