modi: దేశం సంక్షోభంలో ఉంది, మోదీ ఫ్యాక్షనిస్టుగా మారారు: ఎంపీ జేసీ

షార్ట్స్‌లో చూడండి
దేశం సంక్షోభంలో ఉందని, మోదీ ఫ్యాక్షనిస్టుగా మారారని ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీపై కక్షతో మోదీ ఉన్నారని, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్న దుర్మార్గుడు మోదీ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని, పార్టీని రక్షించుకోవడం చంద్రబాబుకు పెద్ద విషయం కాదని అన్నారు.

కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై ఆయన స్పందిస్తూ, దేశం కోసమే రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిశారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కూడా కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలే వస్తాయని జేసీ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
modi
Chandrababu
Rahul Gandhi

More Telugu News