Chandrababu: చంద్రబాబు గారూ.. ఆధారాలు ఇవిగో.. చూడండి!: పవన్ కల్యాణ్

  • తిత్లీ తుపాను గురించి కేంద్రానికి నేను లేఖ రాయలేదని మీరన్నట్టు తెలిసింది
  • ప్రధాని మోదీకి నేను రాసిన లేఖ ఇదే
  • ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రిస్తూ.. మా వార్తలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు
తిత్లీ తుపాను విలయం గురించి తాను స్పందించలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'చంద్రబాబుగారు... తిత్లీ తుపాను గురించి నేను కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ కూడా రాయలేదని మీరు నిన్న అన్నట్టు నాకు తెలిసింది. నేను ప్రధాని మోదీకి లేఖ రాశాను. దానికి సంబంధించిన ఆధారాలు ఇవి. చూడండి' అంటూ పవన్ ట్వీట్ చేశారు. దీంతో పాటు తాను రాసిన లేఖను ఆయన ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.

'ఏపీలో ఉన్న సమస్య ఏమిటంటే... దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు మీవే. జనసేన పార్టీకి సంబంధించిన వార్తలు ప్రజల్లోకి వెళ్లాలా, వద్దా అనే విషయాన్ని మీరే నియంత్రిస్తారు. మా వార్తలు బయటకు రాకుండా మీరు అడ్డుకుంటారు. ఆ తర్వాత జనసేన ఏమీ చేయలేదంటూ పబ్లిక్ లో మమ్మల్ని విమర్శిస్తారు' అంటూ పవన్ మండిపడ్డారు.
Chandrababu
Pawan Kalyan
modi
titli
letter

More Telugu News