jagan: జగన్ పై దాడి కేసు... హైకోర్టులో నేడు విచారణ

  • ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్
  • కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని విన్నపం
  • కోర్టు విచారణ నేపథ్యంలో.. సర్వత్ర ఉత్కంఠ
జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఏపీ పోలీసు అధికారులపై తనకు నమ్మకం లేదని... ఈ నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎనిమిది మందిని ప్రతివాదులుగా జగన్ చేర్చారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విన్నపంతో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరించబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. 
jagan
stab
High Court
petetion

More Telugu News