Uttar Pradesh: రూ.10 లక్షలిస్తావా? రేప్ కేస్ పెట్టమంటావా?: స్నేహితుడినే బెదిరించిన మహిళ

  • ఏవో కారణాలు చెప్పి కొంత డబ్బు వసూలు చేసింది
  • కొంతకాలంగా రూ.10 లక్షల కోసం బెదిరింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఓ మహిళ స్వయానా తన స్నేహితుడినే రూ.10 లక్షలు ఇస్తావా? లేకపోతే రేప్ కేసును ఎదుర్కొంటావా? అని బెదిరించి కటకటాల పాలైంది. ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ పరిధిలోని లఖ్నావాలీ గ్రామానికి చెందిన బాధితుడు, నిందితురాలు కొంత కాలం క్రితం వరకూ స్నేహితులుగా ఉండేవారు.

ఆమె తరచుగా ఏవో ఒక కారణాలు చెప్పి అతని నుంచి కొంత డబ్బును వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా ఆమె తన స్నేహితుడిని రూ.10 లక్షలు ఇస్తావా? లేదంటే తప్పుడు రేప్ కేసు బనాయిస్తానంటూ బెదిరిస్తోందట. ఈ నేపథ్యంలో బాధితుడు తన సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి సంభాషణలూ పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
Uttar Pradesh
Rape Case
Police
Lakhnavali

More Telugu News