swamy paripurnananda: స్వామి పరిపూర్ణానందపై ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

  • ఓటర్లను ప్రలోభపెట్టేలా మాట్లాడారని ఫిర్యాదు
  • ఒక్కొక్కరికీ రూ.200 ఇస్తే వేల ఓట్లు పడతాయన్నారు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు
బీజేపీ నాయకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానందపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నల్గొండలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, దండె విఠల్, అడ్వకేట్ ఉపేందర్ కలిసి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరికీ రూ.200 ఇస్తే వేల ఓట్లు పడతాయంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
swamy paripurnananda
TRS
ec
complaint

More Telugu News