Raja singh: గోవుమాంసం తినే వాళ్ల నాలుకలు కోస్తాం: రాజాసింగ్

  • రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
  • అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన
  • ఎంఐఎం నేతలు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
గోవుమాంసం తినేవాళ్ల నాలుకలు కోస్తామంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పాతబస్తీలో ప్రచారం నిర్వహిస్తున్నామని అక్కడ అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. ఎంఐఎం నేతలు నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. లేకుంటే వారి భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని రాజాసింగ్ హెచ్చరించారు.
Raja singh
MIM Leaders
BJP
Old City

More Telugu News