varalakshmi sarat kumar: ప్రేమ అనే ఫీలింగ్ వచ్చింది .. పోయింది: వరలక్ష్మి శరత్ కుమార్

  • పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ పుట్టాలి 
  • నా ఆలోచనలకి విలువనిచ్చేవాడు దొరకాలి 
  • అవసరమైతే ఒంటరిగానే వుండిపోతాను  
హీరో విశాల్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమలో పడ్డారనే వార్తలు ఆ మధ్య బాగా హల్ చల్ చేశాయి. అయితే ఇద్దరూ కూడా తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ హీరోగా చేసిన 'పందెం కోడి 2'లో ఓ కీలకమైన పాత్రను పోషించిన వరలక్ష్మీ, రేపు విడుదల కానున్న 'సర్కార్' సినిమాలోనూ ఒక ముఖ్యమైన పాత్రను చేసింది.

ఈ నేపథ్యంలోనే 'లవ్ చేయాలనే ఫీలింగ్ మీలో ఎప్పుడైనా కలిగిందా .. లేదా?' అనే ప్రశ్న వరలక్ష్మీకి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. " లవ్ అనే ఫీలింగ్ వచ్చింది .. పోయింది కూడా. ఒక మగాడు పెళ్లి తరువాత తన జాబ్ వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు, నేను మాత్రం పెళ్లి కోసం జాబ్ ఎందుకు వదిలేయాలి? నా అభిప్రాయాలకు  .. ఆలోచనలకు విలువనిచ్చే వ్యక్తే నా జీవితంలోకి వస్తాడు. లేదంటే ఇలా ఒంటరిగానే ఉండిపోతాను. అవతల వ్యక్తిపై ప్రేమనేది లేకుండా ఇంట్లో వాళ్లకోసమో .. సమాజం కోసమో పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు" అని చెప్పుకొచ్చింది.  
varalakshmi sarat kumar

More Telugu News