ntr: ఎన్టీఆర్ సమాధిని లక్ష్మీపార్వతి అపవిత్రం చేశారు: హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు

  • అందుకే ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశాము
  • టీడీపీతో టీఆర్ఎస్ కలిసినప్పుడు అపవిత్రం కాలేదా?
  • టీఆర్ఎస్ ను మహాకూటమి ఇంటికి పంపిస్తుంది
దివంగత ఎన్టీఆర్ సమాధిని తాకి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అపవిత్రం చేశారని హైదరాబాద్ నగర టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్ అన్నారు. అన్నగారి సమాధి అపవిత్రం అయిందని... అందుకే తాము ఈరోజు పాలతో అభిషేకం చేశామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కలయిక అపవిత్రం అంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, టీడీపీతో టీఆర్ఎస్ కలిసినప్పుడు అపవిత్రం కాలేదా? అని ప్రశ్నించారు.

ఒకవైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎంలతో కలసి కేసీఆర్ ప్రయాణిస్తున్నారని విమర్శించారు. మహాకూటమి ద్వారా టీఆర్ఎస్ ను ఇంటికి పంపించడానికి సమయం ఆసన్నమైందని చెప్పారు. మంత్రి హరీష్ రావు తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నరని మండిపడ్డారు.
ntr
lakshmiparvathi
Telugudesam
hyderabad
mn srinivas
TRS
mahakutami

More Telugu News