పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!
- ఈ నెల 17న డ్యామ్ కు గేట్లు బిగిస్తాం
- ప్రపంచ రికార్డును తిరగరాస్తాం
- ఏప్రిల్ కల్లా అన్ని నిర్మాణాలు పూర్తి
ట్విట్టర్ లో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘డిసెంబర్ 17న పోలవరం గేట్లు బిగిస్తాం. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2019 ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులన్నీ పూర్తిచేస్తాం’ అని ట్వీట్ చేశారు.